
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు'తో తన కెరీర్లోనే అతిపెద్ద హిట్ మరియు టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ వసూళ్లు సాధించిన సినిమాను అందించిన తరువాత, మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి విదేశాల్లో విహారాయాత్రలో ఉన్నాడు. సూపర్‌స్టార్ మహేష్ 2-3 నెలల్లో హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. పక్కా మే నుండి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర నిర్మాతలు టాప్ లో ఉన్న బాలీవుడ్ నటి కియారా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారట. మహేష్ ఇంతకు ముందు 'భరత్ అనే నేను'లో కియారాతో రొమాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించింది. అందుకే మహేష్ భార్య కీయారా అయితే బాగుంటుందని పట్టు పడుతుందట. కియారాను హీరోయిన్ గా ఎంపిక చేసుకుంది లేంది గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.