
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22న తన పుట్టినరోజు జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిరుకు మంచి స్నేహితుడు మరియు నటుడు మోహన్ బాబు మెగాస్టార్ కు ఒక విలువైన బహుమతిని పుట్టినరోజు కానుకగా ఇచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా చిరు సోషల్ మీడియాలో ఆ బహుమతిను ఫోటో తీసి పోస్ట్ చేసి అభిమానులతో పంచుకున్నారు. చిరు కోసం డైలాగ్ కింగ్ మోహన్ బాబు చెక్కతో బైక్ను తయారు చేయించి బహుమతిగా ఇచ్చి చిరుపై తన అభిమానాన్ని చాటారు. చిరంజీవి తన ట్వీట్ లో ' నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టినరోజునాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయని' తెలియజేసారు.