Iఏ సినీ రంగంలోనైనా హీరొయిన్లకు లైఫ్ తక్కువ అన్న విషయం తెలిసిందే. అలా మోనాల్ గజ్జర్ అరకొర సినిమాల్లో నటించి మాయమైంది. మళ్ళీ బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో దర్శనమిచ్చింది. మొదట వచ్చి రాని బాషాతో ఇంట్లో కొనసాగడం కష్టమే అనుకున్నారు. కానీ రాను రాను ఆమె ఇంట్లో పండిస్తున్న కంటెంట్ కి ఓట్లు బాగానే పడి ఫైనల్ 6వ కంటెస్టెంట్ గా నిలిచింది. ఈమెకు బయట మంచి క్రేజ్ ఏర్పడింది. ఎంతగా అంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అభిజిత్ కు దక్కని అవకాశాలు ఈ అమ్మాడుకి దక్కుతున్నాయి. వచ్చి రాగానే అల్లుడు అదుర్స్ మూవీలో స్పెషల్ సాంగ్ అలాగే స్టార్ మా లో డ్యాన్స్ షో లో జడ్జ్ గా చేయటం….ఇలా మోనాల్ పిచ్చి బిజీ బిజీగా గడుపుతూ కాసులు వెనకేసుకుంటుంది. అభిజిత్ ను మాత్రం ఇంటర్వ్యూలలో తప్పితే మరెక్కడా చూడలేదు. మోనాల్ కు మాత్రం షాప్ ఓపెనింగ్లు, స్పెషల్ ఈవెంట్లు ఇలా వరుసపెట్టి ఆఫర్లు వస్తున్నాయి. మొత్తానికి మోనాల్ కు మంచి కాలం నడుస్తుంది.
