
బిగ్ బాస్ సీజన్ 4 గురించి ఇంకో 4 - 5 రోజులు మాట్లాడుకుంటామేమో...ఎందుకంటే గ్రాండ్ ఫినాలే ఆదివారం జరగనుంది. చూస్తుండగానే షో మొదలై జీర్నడ్ ఫినాలేకు చేరువలో ఉంది. అయితే రెండో లేక మూడో వారంలో ఎలిమినేట్ అవుతుందని అనుకున్న గుజరాత్ ముద్దుగుమ్మ మోనాల్ గజ్జర్ టాప్ 6 వరకు వచ్చింది. గత ఆదివారం ఇంటి నుండి ఎలిమినేట్ అవ్వడంతో మోనాల్ ఫ్యాన్స్ టైటిల్ మరియు 50 లక్షలు మిస్ అయిందే అంటూ బాధపడుతుంటే తాజా వార్త అందరికి షాకింగ్ గా ఉంది. మోనాల్ కు వారానికి రూ. 3.5 లక్షల రెమ్యునరేషన్. అంటే 14 వారాలకు గాను మోనాల్ ఇంటికి సుమారు రూ. 48 లక్షలు తీసుకెళ్లింది. అందుకేనేమో ఎలిమినేట్ అయినప్పుడు కూడా పెద్దగా ఏడవకుండా నాకు ఇది చాలు అని డైలాగులు కొట్టిందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.