
బిగ్ బాస్ సీజన్ 4 పై గత వారం ఎలిమినేషన్ తర్వాత నుంచి కొంత వ్యతిరేకత పుట్టుకొచ్చింది. మోనాల్ గజ్జర్ కు తక్కువ ఓట్లు వచ్చినా ఆమె ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇద్దరి కృష్ణుల ముద్దుల రాధ కథ పూర్తవుతుందని కావాలనే కుమార్ సాయిను ఎలిమినేటి చేశారని సోషల్ మీడియా మాధ్యమాల్లో నెటిజన్లు బిగ్ బాస్ యాజమాన్యంపై భగ్గుమన్నారు. అయితే అనూహ్యంగా ఈ వారం కూడా మోనాల్ నామినేషన్లో ఉంది. కాబట్టి గేమ్ పరంగా చూసుకున్నా ఆమె అంత గొప్పగా ఆడకపోవడంతో ఈసారి కూడా నెటిజన్లు ఆమె ఎలిమినేట్ అవ్వడం కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో ఈసారి ఆమె ఇంట్లో నుంచి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. కానీ నాగార్జున ఈ వీకెండ్ నుంచి కొన్ని వారాల వరకు స్టేజ్ పై కనిపించరు. మరి నాగార్జునను భర్తీ చేసేది ఎవరు? రోజానా? లేదా రమ్య కృష్ణనా? అనేది చూడాలి.