
బిగ్ బాస్ ఇంట్లో మోనాల్ గ్లామర్ డోస్ పెంచుతూనే మరో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లతో ఆడుకుంటుంది. ఒకరంటే ఇష్టమని చెప్పి ఇంకొకరితో రోజంతా కూర్చుంటుంది. మోనాల్ మాటలకు వాళ్ళిద్దరి మధ్య దూరం పెరిగింది. ఆ ఇద్దరు అందరికి తెలిసిన వాళ్ళే...'అభిజీత్', 'అఖిల్'. రెండు వారల క్రితం దివి మోనాల్ ఒకే విషయాన్నీ నాలుగు రకాలుగా, నాలుగు అబద్దాలు చెబుతుందని అందుకే ఆమెను నేను నమ్మనని నాగార్జున ముందే తెగేసి చెప్పింది.
ఇప్పుడు దివి మాటలే నిజమయ్యాయి. గత వారం నామినేషన్ల ప్రక్రియలో తన పేరు తెచ్చారని తెగ హార్ట్ అయింది మోనాల్. అయితే ఆ సంఘటనలో అఖిల్ దే తప్పు అని అభిజీత్ తో చెప్పింది, ఇంకోదగ్గర అభిజీత్ దే తప్పు అని అనింది ఇక మొన్న నాగార్జున ముందు ఇద్దరిది తప్పు అని చెప్పింది. దీంతో ఇది చూసిన అభిజీత్ తట్టుకోలేకపోయాడు. నీకు నచ్చినట్లు మాట మార్చేస్తావా? అంటూ ఆమెపై ఫెయిర్ అయ్యి, ఇకపై మనం మాట్లాడుకోకుండా ఉండటమే మంచిదంటూ అభిజీత్ అన్నాడు. మరి ఈ గొడవ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.