
2019 లో, చాలా మంది నటీమణులు వారి సినిమాలతో అలరించారు. అయితే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యొక్క టాప్ నటీమణి సమంత అక్కినేని సినిమాలతో తన ఫ్యాన్ బేస్ ను ఎలా పెంచుకుందో చూశాము. ఇంతలో, హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ 2019 జాబితాలో ముందుకు సమంత అక్కినేని అగ్రస్థానాన్ని సంపాదించింది. నాగ చైతన్య భార్య మరియు కింగ్ నాగార్జున కోడలు సమంత అక్కినేని 2019 సంవత్సరానికి గాను హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఎంపికైంది. గత సంవత్సరం సమంత అక్కినేని మూడవ స్థానాన్ని ఆక్రమించింది, కానీ ఈసారియంగ్ భామలను పక్కకునెట్టి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. సంజన విజ్ (2), పివి సింధు (3), అదితి రావు హైదారి (4), పూజా హెగ్డే (5) స్థానాల్లో నిలిచారు. సమంత 2019లో మజిలీ, ఓ బేబీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. సమంత నటించిన తాజా చిత్రం జాను బాక్స్ ఆఫీసు వద్ద కమర్షియల్ గా ఫెయిల్ అయినప్పటికీ ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.