
కొన్నిసార్లు ఒక సినిమా టైటిల్ ఒక హీరోకు లేదా హీరోయిన్కో లేదా డైరెక్టర్కో ఇంటి పేరుగా మారిపోతుంది. అలా మారిపోయిన డైరెక్టర్ల పేర్లలో భాస్కర్ అలియాస్ బొమ్మరిల్లు భాస్కర్ ఒకటి. బొమ్మరిల్లు సినిమా తరువాత అదే భాస్కర్ ఇంటి పేరు అయిపోయింది. అయితే చాల కాలం తర్వాత బొమ్మరిల్లు భాస్కర్ అక్కినేని అందగాడు అఖిల్ హీరోగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయిన రోజు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని సినిమాల రిలీజ్ డేట్ లు వరుసపెట్టి వస్తున్నాయి ఇంకా మా అఖిల్ బాబాయ్ ది రాలేదేంటి అనుకుంటున్న సమయంలో చిత్ర యూనిట్ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. మొత్తానికి ఆ డేట్స్ లో పెద్ద సినిమాలు రిలీజ్ ఇప్పటికైతే లేకపోవటంతో అఖిల్ సేఫ్ జోన్ లో ఉన్నట్లే లెక్క.