
నవ్వించే వాడి వెనకే అసలు కష్టాలుంటాయి అనేది ముక్కు అవినాష్ కధ వింటే మళ్ళీ నిజమే అనిపిస్తుంది. బిగ్ బాస్ లోకి అతను వెళ్ళడానికి గల అసలు కారణమేంటో నిన్నటి ఎపిసోడ్ లో చెప్పాడు. మార్నింగ్ మస్తీలో భాగంగా అవినాష్ అతని కష్టాలను వెళ్లగక్కాడు. ఇంటి ఈఎంఐ 45 వేలు కట్టలేకపోయాను. నేను ఇంటి కోసం దాచిన డబ్బులు హాస్పిటల్లకు పెట్టాల్సి వచ్చింది. నాన్నకు రెండు సార్లు గుండె ఆపరేషన్ చేయించాను. దానికి 4 లక్షలు అయింది. ఆ వెంటనే అమ్మ మోకాళ్ళ చిప్పలు అరిగిపోతే ఆపరేషన్ చేయించాను. లాక్ డౌన్ కారణంగా నేను ఏమి చేయలేక బయట 13 ,14 లక్షలు అప్పు చేశాను. కానీ ఆర్టిస్టులు ఎంటువంటి పరిస్థితిలో ఉన్నా ప్రేక్షకులకు, అభిమానులకు పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ తట్టుకోలేకా సూసైడ్ చేసుకుందామనుకున్నా కానీ నేను చనిపోతే అమ్మ నాన్నలకు ఏదైనా కష్టమొస్తే ఎవరు చూసుకుంటారని ఆలోచనతో ఆగిపోయానని తాను బిగ్ బాస్ లోకి ఎందుకొచ్చాడో చెప్పకనే చెప్పాడు.