
నభా నటేష్ అందం అభినయం ఉన్న కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 19 సంవత్సరాల వయస్సులోనే యాక్టింగ్ మొదలు పెట్టింది. అప్పటి నుండి తిరిగి చూడలేదు. నభా నటేష్ 2015లో శివరాజ్‌కుమార్ హీరో తెరకెక్కిన 'వజ్రకాయ' అనే కన్నడ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆమె కన్నడలోనే కాదు తెలుగులోను మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆమె మొదటి తెలుగు చిత్రం సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'నన్ను దోచుకుందువటే'. ఇంజనీరింగ్ చేసి మోడల్ గా మారిన నటి నభా ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు 2013లో కూడా పాల్గొనింది. తాజా సంచలనం ఇస్మార్ట్ శంకర్ తో నభా రెమ్యునరేషన్ పెంచేసింది. ఇప్పుడు సినిమాలో నటించేందుకు ఆమె 8లక్షల రూపాయలు డిమాండ్ చేస్తోంది. అంతేకాదు కుర్ర హీరోల సరసన చేసేందుకు అమ్మడు ఒప్పుకోవట్లేదు. కేవలం బడా స్టార్లతోనే చేస్తానని అంటుందట. ఆమె కోసం వెళ్లిన ప్రొడ్యూసర్లకు ఆమె అడుగుతున్న రెమ్యునరేషన్ చూసి షాక్ అవుతున్నారాట.