
టాలీవుడ్లో కొత్త హీరోయిన్లు చాలా మందికి వచ్చినప్పటికీ అందరూ నిలద్రొక్కుకోలేకపోతున్నారు. సీనియర్ హీరోయిన్లను పెట్టుకోవడానికి కుర్ర హీరోలు ముందుకు రావట్లేదు. ప్రస్తుతం పూజా హెగ్డే హవా నడుస్తోంది. అలానే మరోపక్క కన్నడ భామ రష్మీక మందన్న కూడా మంచి జోరు మీద ఉంది. వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్నారు ఈ ముద్దుగుమ్మలిద్దరూ. ఈ ఇద్దరు కాకుండా కుర్ర హీరోలు ఇస్మార్ట్ బ్యూటీ నాభా నటేష్ ను ఎంపిక చేసుకుంటున్నారు. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నాభా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ లో నాభా తెలంగాణ యాసలో ఇస్మార్ట్ గా చేసి హిట్ కొట్టేసింది. దీంతో వెంటనే డిస్కో రాజా లో అవకాశం దక్కించుకుంది. సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాలో కూడా చేస్తుంది. ఇదిలా ఉండగా ఆమె చేతిలో 10కి పైగా అవకాశాలు ఉండటంతో అమ్మడు రెమ్యునరేషన్ డబుల్ చేసేసింది. కుర్ర హీరోలకు నాభా బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తోంది. అందుకే డిమాండ్ చేసినంత ఇస్తున్నారు. మరి అమ్మడు ముందుముందు ఇంకెంత పెంచుతుందో చూడాలి.