
అక్కినేని వారసుడిగా 'జోష్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చిన నాగచైతన్య మెల్లగా తనకంటూ ఫ్యాన్ బేస్ ను ఏర్పర్చుకున్నాడు. యువ సామ్రాట్ గా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఫ్యాన్స్ ను నాగచైతన్య అన్ని సినిమాల్లోకి మీకు నచ్చే సినిమా ఏదంటే... టక్కున 'ఎం మాయ చేసావే' అంటారు. దానికి కారణం ఆ సినిమా చేసిన మ్యాజిక్ తో పాటు రీల్ జంట రియల్ జంట అవ్వడం. కానీ నాగచైతన్య మాత్రం తన కెరియర్ లో తనకు ఎప్పటికైనా స్పెషల్ సినిమాలంటే రెండే రెండు అంటున్నాడు. నాగచైతన్య, వెంకటేష్ నటించిన 'వెంకీ మామ' ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన చై... నాకు ఎప్పటికి స్పెషల్ గా ఉండే సినిమాల్లో తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి నటించిన ‘మనం’ ఒకటైతే మామా వెంకటేష్ తో నటించిన 'వెంకీ మామ' మరొకటి అని చెప్పాడు. ఇకపై ఎన్ని సినిమాలు చేసిన ఈ రెండు చిత్రాలు మాత్రం ప్రత్యేకమని చెప్పుకొచ్చాడు. ఇక డిసెంబర్ 13 వెంకటేష్ పుట్టినరోజున వెంకీ మామ రిలీజ్ కానుంది.