
అక్కినేని నాగ చైతన్య మజిలీ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించాడు. అతని చివరి రెండు చిత్రాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' చిత్రంలో మధ్యతరగతి వ్యక్తి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ దాదాపు పూర్తి కాగా కరోనా వైరస్ కారణంగా మిగితా షూట్ ను నిలిపివేశారు. ఈ రోజు, కింగ్ అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా, నాగ చైతన్య తన తదుపరి చిత్రంను అధికారికంగా ప్రకటించాడు. మనమ్ ఫేమ్ విక్రమ్ కుమార్తో నాగ చైతన్య జతకట్టనున్నట్లు చాలా కాలంగా ఉహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు, ఇది అధికారికంగా మారింది. నాగ చైతన్య ప్రధాన పాత్రలో ఉన్న ఈ చిత్రానికి 'థాంక్ యూ' అనే టైటిల్ ను పెట్టారు. దీన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించనున్నారు. లవ్ స్టోరీ పూర్తయిన తర్వాత ఇది తక్షణ ప్రాజెక్ట్ అవుతుంది.