
అక్కినేని వారసుడు నాగచైతన్య వరుసగా మంచి సినిమాలను లైన్ అప్ చేసినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకతంలో తెరకెక్కుతున్న 'లవ్ స్టోరీ' లో సాయి పల్లవితో నటిస్తున్నాడు. ఇది మరికొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కానున్న సందర్భంలో కరోనా వచ్చి పడింది. అయితే ఈ సమయంలో మంచి కధలను ఎంపిక చేసుకునే పనిలో పడ్డాడు చై. దిని తర్వాత అక్కినేని కుటుంబంకు 'మనం' తో గుర్తుండిపోయే హిట్ ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కే కుమార్ తో దిల్ రాజు ప్రొడక్షన్లో ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత మోహన్ కృష్ణ ఇంద్రగంటితో ఒకటి, దర్శకురాలు నందిని రెడ్డితో ఒకటి చేయనున్నాడు. ఈ లైన్ అప్ చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద చై మంచి విజయాలు సాధించనున్నట్లు తెలుస్తుంది.