
కూతురు పుట్టినప్పటి నుంచి పెరిగి, పెద్దై, పెళ్లి చేసుకోని పిళ్లపాపలతో సుఖంగా ఉండేంత వరకు తను ఏమి అడిగితే అది, కాదు లేదని చెప్పకుండా ఆమె ఆనందమే తన ఊపిరిగా బ్రతుకుతాడు నాన్న. అలాంటి అద్భుతమైన నాన్న-కూతురి కధలు ఎన్నో ఉంటాయి. అయితే అలాంటి ఓ చిన్న కథ మెగా బ్రదర్ నాగబాబు అతని కూతురికి కూడా ఉంది. వినాయక చవితి సందర్భంగా షూట్ చేసిన ప్రత్యేక పోరాగ్రామ్ కి సంబంధించిన ఒక ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో నాగబాబు తన కూతురికి సంబంధించిన ఒక సంఘటనను చెప్పి ఎమోషనల్ అయ్యారు.
'మేము న్యూజిల్యాండ్ కు వెళ్ళినప్పుడు, నిహ ఎవరినో చూసి నేనే అనుకోని వెళ్ళిపోయింది. అరగంట సేపు కనిపించలేదు. అప్పుడు న్యూజిలాండ్ లో అందరిని చంపేయాలనంత కోపం వచ్చింది. వరుణ్ ని వేతకమని పంపి నేను, నా భార్య ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నా. కాసేపు కనిపించకపోతేనే తట్టుకోలేకపోయాను. నిహ నా ఏంజెల్' అంటూ చెప్పి ఎమోషనల్ అయ్యారు. ఈ చిన్న కథ విన్నవారంత వాట్ ఏ బాండింగ్ అని కొనియాడ్తున్నారు.