
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ షో ద్వారా మెగా బ్రదర్ నాగబాబుకు కూడా విపరీతమైన క్రేజ్ వచ్చింది. కానీ కొన్ని రోజుల క్రిందట నాగబాబు, జబర్దస్త్ లోని కొంతమంది ఆ షోను విడిచి బయటకు వచ్చేసారు. తాజాగా నాగబాబు "అదిరింది" అనే కామెడీ షోను ప్రారంభించారు. ఆదివారం నాడు తొలి ఎపిసోడ్ ప్రసారమైంది. మొదటి ఎపిసోడ్లోనే ధన్ రాజ్, ఆర్పీ, చంద్ర తమ స్కిట్లతో అలరించారు. నవ్వులు పూయించారు. దీంతో అదిరింది షోకు మంచి రెస్పాన్స్ వచ్చిందని...మీ ఆదరణ ఇలానే కొనసాగాలని..మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేస్తామని యాజమాన్యం తెలిపారు. అయితే అదిరింది షో ప్రసారమైన రోజే జబర్దస్త్ పాత స్కిట్లను ప్రసారం చేయడం చూసి షాక్ అయ్యానన్నారు నాగబాబు. "ఏ రోజు జబర్దస్త్ కు పోటీగా రావాలి అనుకోలేదు. అందుకే ఆదివారం నాడు ప్రసారం చేసాం. కానీ ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారమైన సమయంలోనే జబర్దస్త్ ప్రోగ్రాం ప్రసారం కావడం చూసి షాక్ తిన్నట్లు చెప్పారు.