
మెగా ఫ్యామిలీ కాంపౌండ్ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె కొణిదెల నిహారిక. ఎంతో చెలాకీగా ఎప్పుడు నవ్వుతూ, నవ్విస్తూ ఉండే నిహారిక పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతేకాకుండా తానే సొంత బ్యానర్ ను స్టార్ట్ చేసి వెబ్ సిరీస్ ను ప్రొడ్యూస్ చేస్తూ కొత్త టాలెంట్ ను ప్రోత్సహిస్తుంది. అయితే ఈ మెగా డాటర్ పెళ్లిపై ఎన్నో పుకార్లు పుట్టుకొచ్చాయి. ఓసారి అక్కినేని అఖిల్ ను పెళ్లాడనున్నట్లు, మరోసారి బావ సాయి ధరమ్ తేజ్ తో ప్రేమలో ఉన్నట్లు ఇలా రకరకాలుగా రూమర్స్ వినిపించాయి. వాటన్నింటికి చెక్ పెడుతూ తాజాగా తాను చైతన్య జొన్నలగడ్డను పెళ్లాడబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. కట్ చేస్తే, ఆగస్టు 13న కుటుంబ సభ్యుల నడుమ నిహారిక-చైతన్యల ఎంగేజ్మెంట్ జరిగింది. పెళ్లి కూతురుగా మారబోతున్న తన కూతురిని చూసి ఎమోషనల్ అయ్యారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఈ నిశ్చితార్థంలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కనపడ్డారు ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. మెగా సభ్యులను ఒకే ఫ్రెమ్ లో చూసి సంబరపడుతున్న మెగా అభిమానులకు పవన్ కళ్యాణ్ ఆ ఫ్రెమ్ లో లేకపోవటం లోటైంది. మరి పవన్ మిస్ కొట్టడానికి గల కారణమైతే తెలీదు కానీ మెగా డాటర్ నిశ్చితార్థం పుణ్యమాని ఫ్యాన్స్ కు అందరిని ఒకే ఫ్రెమ్ లో చూసే అవకాశం దక్కింది.