Nagababu Goodbye to Jabardast Show due to Remuneration? Nagababu given by Clarity
3 years ago

రెమ్యునరేషన్ కారణంగా జబర్దస్త్ షోకు నాగబాబు గుడ్ బై ? క్లారిటీ ఇచ్చిన నాగబాబు
ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్త్ర జబర్దస్త్ కామెడీ షోలు ఎంతగా పాపులర్ అయ్యాయో వేరే చెప్పాల్సిన పని లేదు. జబర్దస్త్ షో ద్వారా ఎంతోమందికి పాపులారిటీ పెరిగింది, క్రేజ్ పెరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా గుర్తింపు వచ్చింది. అయితే ఈ షో నుండి జడ్జి నాగబాబు తప్పుకున్న విషయం తెలిసిందే. నాగబాబు రెమ్యునరేషన్ కారణంగా తప్పుకున్నారని, మనస్పర్థలు వచ్చాయని ఇలా రకరకాలుగా రూమర్లు పుట్టుకొస్తున్నందున తాజాగా వాటికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు నాగబాబు. " జబర్దస్త్ తో నా అనుబంధం 7ఏళ్లకు పైగా కొనసాగింది. అలాంటి షో నుండి నేను తప్పుకున్నందుకు నాకు బాధగానే ఉంది. కానీ బయట వస్తున్న వార్తల వలన కాదు. బిసినెస్ పరంగా ఐడియాలజీ వల్లే తప్పుకున్నా. నేను శ్యామ్ ప్రసాద్ గారికి, ఈటీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్న. నేను రెమ్యునరేషన్ వల్ల తప్పుకున్నాను అనే దాంట్లో ఎంతమాత్రం నిజం లేదు. నా స్థాయికి తగ్గట్టు కాకపోయినా శ్యామ్ ప్రసాద్ 100శాంతం రెమ్యునరేషన్ ఇచ్చారని" తెలిపారు.