
తప్పో ఒప్పో మన కుటుంబ వ్యక్తి గురించి బయట వాళ్లు మాట్లాడితే తట్టుకోలేము ఉరుకోలేము. అదే జరిగింది ఇప్పుడు మెగా ఫ్యామిలీలో కూడా. నటుడు ప్రకాష్ రాజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు అతని పార్టీ జనసేనపై దారుణమైన కామెంట్స్ చేసాడు. పవన్ ఊసరవెల్లి అంటూ మాట మీద నిలబడడు అంటూ నిందించాడు. దీంతో మెగా బ్రదర్ ఊరుకుంటారా....అయన రంగంలోకి దిగి...ప్రకాష్ రాజ్ ను వ్యక్తిగతంగా, వృత్తిపరంగా దారుణంగా విమర్శించారు. 'నువ్వు డబ్బుల కోసం నిర్మాతలను ఎంత హింస పెట్టేవాడివో...టైంకి రాకుండా, ఇచ్చిన డేట్స్ క్యాన్సల్ చేసి దర్శకనిర్మాతలు ఎంత క్షోభకు గురి చేసేవాడివో...మర్చిపోయావా ప్రకాష్ రాజ్. ముందు నువ్వు మంచి మనిషిగా మారి ఆ తర్వాత ఓ మంచి మనిషి, నిస్స్వార్ధ నాయకుడైన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడంటూ తమ్ముడిని వెనుకేసుకొచ్చాడు. మరి సోషల్ మీడియాలో మొదలైన ఈ మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.