
తెలుగు నటుడు, నిర్మాత నాగా బాబు కొనిదేలా కోవిడ్ -19 కు పాజిటివ్ గా నిర్ధారించబడ్డారు. ఈ వార్తను అభిమానులతో, నెటిజన్లతో పంచుకునేందుకు ట్విట్టర్లో "ఏదో ఒక వ్యాధి రాగానే బాధపడటం కాదు. నాకు కరోనా పాజిటివ్ గా తేలింది. దానికి నేను బాధపడట్లేదు, భయపడట్లేదు. త్వరగా కోలుకుని త్వరలో ప్లాస్మా దాతగా తిరిగి వస్తానని" తెలిపారు. ఈ ట్వీట్ చూసిన కొణిదెల అభిమానులు, సినీ ప్రేక్షకులు నాగబాబు త్వరగా కొలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇక తాను ఐసోలేషన్ లో ఉన్నానని త్వరగా కోలుకుని యాంటీ బాడీస్ డెవలప్ చేసుకొని ప్లాస్మా డోనెట్ చేస్తానాని తెలిపారు.