
'లిడర్', 'ఆనంద్', 'హ్యాపీ డేస్', 'ఫిదా' వంటి క్లాస్ హిట్స్ ను అందించిన శేఖర్ కమ్ముల చివరిగా తెరక్కేకించిన సినిమా ఫిదా. అది ఏ రేంజ్ లో రికార్డులను కొల్లగొట్టిందో వేరే చెప్పాల్సిన పని లేదు. సాయి పల్లవికి విపరీతమైన క్రేజ్, గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా ఫిదా. అలాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన శేఖర్ కమ్ముల తదుపరి సినిమా ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అక్కినేని నాగచైతన్య హీరోగా, సాయి పల్లవి హీరోయిన్ గా ఒక ప్రేమ కథ ఆధారంగా సినిమాను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కొద్దిసేపటి క్రితం సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. 'లవ్ స్టొరీ' అనే టైటిల్ ను ఫిక్స్ చేసింది బృందం. ఫస్ట్ లుక్ లో నాగచైతన్య, సాయి పల్లవి మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఈ చిత్రం కూడా తెలంగాణ ప్రేమ కథ అని తెలుస్తోంది.