
"ఎం మాయ చేసావే" సినిమాతో వెండితెరపై అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన జంట నాగచైతన్య-సమంత. సమంతకు అది మొదటి సినిమా కాగా నాగచైతన్యకు రెండోవ సినిమా. అందులో వీరి మధ్య కెమిస్ట్రీకి యూత్ ఫిదా అయ్యారు. అప్పటి నుంచే ప్రేమలో ఉన్న ఈ జంట "మనం" సినిమా తర్వాత కొన్నాళ్లకు మూడు ముళ్లతో ఒకటయ్యారు. అక్కినేని వారి కొడలైన సమంత ఆ రోజు నుంచి కధల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్త పడుతూ వస్తుంది. అయితే పెళ్లి జరిగిన తర్వాత ఈ ఇద్దరు కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన "మజిలీ" లో నటించారు. పెళ్లి తర్వాత ఇద్దరు తెరపై కనిపించటం, ప్రేమ కథ అవ్వటంతో బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ జంట అలరించబోతున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ పరుశురాం తో నాగచైతన్య చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా సమంత చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.