
నాగ చైతన్య ఇప్పుడు టాలీవుడ్లో సంతోషంగా మంచి స్థానంలో ఉన్నాడు. మొదటి నుంచి కష్టపడి అతనికంటూ సొంత, స్థిరమైన మార్కెట్‌ను ఏర్పర్చుకున్నాడు. నాగ చైతన్య యొక్క ఇటీవలి రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ అయ్యాయి. అతని తాజా చిత్రం 'లవ్ స్టోరీ' నిర్మాణంలో ఉంది. ఈ చిత్రం అద్భుతమైన అంచనాలను కలిగి ఉంది. ఇది జూన్ నెలలో విడుదల కానుంది. ఆ తర్వాత నాగ చైతన్య పరశురం దర్శకత్వంలో నటించనున్నాడు. సమంత కూడా టాలీవుడ్ అగ్ర నటిగా కొనసాగుతోంది. తాజా చిత్రం 'జాను' బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ, సమంత నటనకు చాలా ప్రశంసంసలు దక్కాయి. తాజా అప్డేట్ ప్రకారం నాగ చైతన్య, సమంత త్వరలో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. నాగార్జునకు అన్నపూర్ణ ప్రొడక్షన్స్ కలిగి ఉన్నప్పటికీ, నాగ చైతన్య తన సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాడు. తాజా అప్డేట్ ప్రకారం నాగ చైతన్య తొలి ప్రొడక్షన్ ప్రాజెక్ట్ కు నూతన దర్శకుడు దర్శకత్వం వహించనున్నాడు మరియు రాజ్ తరుణ్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. ప్రొడక్షన్ హౌస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.