
స్టార్ హీరోలకు పెద్ద ఎత్తున అభిమానులు వుంటారు. అలాగే, అభిమాన సంఘాలు కూడా ఉంటాయి. ఇక తమ అభిమాన నటుడి సినిమా విడుదలైతే కనుక ఆ అభిమాన సంఘాల వారు చేసే హడావిడి.. సందడి అంతాఇంతా కాదు. థియేటర్ల దగ్గర వాళ్ల సందడి చూసి తీరాల్సిందే. ఇప్పుడు అక్కినేని నాగ చైతన్య కూడా అలాగే మహేశ్ బాబుకి అభిమానిగా మారాడు. అంతేకాదు, మహేశ్ అభిమాన సంఘానికి అధ్యక్షుడు కూడా. అయితే, ఈ ముచ్చట చైతు నటిస్తున్న తాజా చిత్రంలోనిది. 'మనం' ఫేమ్ విక్రంకుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా 'థ్యాంక్యూ' పేరిట ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలోనే చైతు అలా మహేశ్ బాబు అభిమాన సంఘానికి అధ్యక్షుడుగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదు, అబిడ్స్ లోని రామకృష్ణ థియేటర్లో జరుగుతోంది. అక్కడ మహేశ్ సినిమా సందర్భంగా చైతన్య తన సహచరులతో చేసే హడావిడికి సంబంధించిన దృశ్యాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు.