
పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించాలని మన హీరోలంతా ఉవ్విళ్లూరుతుంటారు. ఇలాంటి పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్రను వేస్తాయన్నది వారి నమ్మకం. పైపెచ్చు, ఈ తరహా పాత్రలు తమలోని అసలైన నటుడిని కూడా బయటకు తెస్తాయన్నది వారి భావన. అందుకే, అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తుంటారు. తాజాగా అక్కినేని నాగచైతన్యకు కూడా అలాంటి అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. తొలిసారిగా పూర్తినిడివి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో ఆయన నటించనున్నట్టు సమాచారం. 'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్ భాస్కర్ ఇటీవల ఇలాంటి పోలీసాఫీసర్ కథతో చైతూని కలిసినట్టు చెబుతున్నారు. స్క్రిప్ట్ నచ్చడంతో చైతు వెంటనే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.