
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున పేరుకు తగ్గట్టే ఇమేజ్ ను గ్లామర్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. తన కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి తాత అయ్యే వయసులో కూడా అంతే యెవ్వనంగా కనిపిస్తూ ఇప్పటికి అమ్మాయిల యువ సామ్రాట్ లానే ఉన్నారు నాగార్జున. సరే కానీ, ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటారా?? అప్పట్లో పేరుకు తగ్గట్టే నాగార్జున రియల్ లైఫ్ లో కూడా మన్మథుడని బలంగా వినిపించేది. మరి ముఖ్యంగా నటి టబుతో నాగార్జున కొంతకాలం ప్రేమాయణం నడిపారని అప్పట్లో...అబ్బో మారుమోగిపోయింది. అంతేకాదు నాగార్జున ప్రేమ, బ్రేకప్ తర్వాత టబుకు పెళ్లిపై ఆసక్తిపోయి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదని టాక్. అయితే మరీ ఇది రూమరా లేక నిజంగా నిజమేనా అనేది నాగార్జున, టబుకు మాత్రమే తెలియాలి. అయితే తాజాగా నెటింట ఓ ఫోటో వైరల్ అవుతుంది. ఆ ఫోటో మరెవరిదో కాదు నాగార్జున, అమల, టబులదు. వీళ్ళ ముగ్గురిని ఒకే ఫ్రెమ్ లో చూసేసరికి అభిమానులు షాక్ అవుతున్నారు. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్నారు.