
కింగ్ అక్కినేని నాగార్జున ఆరుపదుల వయసులో కూడా కొడుకులకు పోటీ ఇస్తూ మరి కెరియర్ను ప్లాన్ చేసుకుంటున్నాడు. మొన్నటి వరకు తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ హోస్ట్ గా బిజీ బిజీగా ఉన్న నాగ్ అది ముగిసే సరికి మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. అయితే నాగ్ నటించిన మన్మథుడు2 ఆయన ఇమేజ్ ను కాస్త డ్యామేజ్ చేసిందని భావిస్తున్న నాగ్ తన తదుపరి సినిమా విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆరుపదుల వయసులో సినిమాలు చేయటం బాగుంది కానీ రొమాన్స్ చేయటమెంటని విమర్శలు వినిపించిన తరుణంలో కళ్యాణ్ కృష్ణతో చేయాల్సిన సోగ్గాడే చిన్నినాయనా సీక్వెల్ ను కూడా పక్కన పెట్టాడు. కొత్త డైరెక్టర్ సాల్మన్ తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో నాగ్ సరసన కాజల్ అగర్వాల్ నటించనుంది. అయితే కాజల్ ఈమధ్యకాలంలో సీనియర్ హీరోల చాయ్స్ అయిపోయింది. అందుకే అప్పుడు కొడుకు నాగచైతన్యతో నటించిన కాజల్ ఇప్పుడు తండ్రితో చేయనుంది.