
కరోనా మహమ్మారి ఎవ్వరిని వదలడం లేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి. ఎంతటి మహామహులైన సరే దిని నుంచి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా భారిన పడిన విషయం తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు చిరంజీవికి ఎటువంటి లక్షణాలు లేవు. అయితే ఆ మునపటి రోజే చిరు నాగ్ కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లడం జరిగింది. దీంతో ఇప్పుడు నాగార్జున కూడా కరోనా టెస్ట్ ఇవ్వడం జరిగింది. కింగ్ నాగార్జునకు కరోనా పరీక్షా కొత్తేమి కాదు ప్రతి వారాంతపులో బిగ్ బాస్ స్టేజ్ ఎక్కేముందు కరోనా టెస్ట్ చేయించుకుంటున్నారు. కానీ ప్రతిసారి ఒకెత్తు ఈసారి ఒకెత్తు. పక్క పక్కనే కలిసి తిరిగిన చిరంజీవికి రావటంతో నాగ్ తన టెస్ట్ రిజల్ట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. నాగ్ కి పొరపాటున పాజిటివ్ అని వస్తే బిగ్ బాస్ షోలో కనిపించరు. మరి ఎం జరుగుతుందో కాలమే నిర్ణయించాలి.