
అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 చూస్తుండగానే 40 రోజులు పూర్తి చేసుకుంది. రోజు రోజుకు ఎంతో రసవత్తరంగా మారుతుంది. ఇంటి సభ్యుల మధ్య కనెక్షన్లు మారుతూ వస్తున్నాయి. మొన్నటి వరకు ఈ వీకెండ్ నుంచి నాగార్జున కొన్ని వారాల పాటు కనిపించరనే వార్త హల్ చల్ చేసింది. అయితే తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ద్వారా నాగార్జుననే వీకెండ్ మళ్ళీ హంగామా చేయబోతున్నారని క్లారిటి వచ్చేసింది. ఇకపోతే గడిచిన వారంలో బిగ్ బాస్ పలు డీల్స్ ఇవ్వటం జరిగింది. అందులో సగం గుండు, సగం గడ్డం చేయించుకోవాలనే డిల్ ను అమ్మా రాజశేఖర్ సహా మిగితా ఇంటి సభ్యులు తిరస్కరించారు. తాజాగా విడుదల చేసిన వీకెండ్ ప్రోమోలో నాగార్జున వచ్చే వారం నామినేషన్ల నుండి నేరుగా సేవ్ అయ్యేందుకు సగం గుండు, సగం గడ్డం చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడంతో అమ్మా ఏడుస్తూనే ఒప్పుకోలేక ఒప్పుకొని రెడీ అయ్యి చేయించుకున్నారని తెలుస్తోంది. ఇది బిగ్ బాస్ ఇంటి సబ్యులకు గుణపాఠంగా కావాలనే ప్లాన్ చేసినట్లు అనిపిస్తుంది.