
నాగార్జున తాజా చిత్రం 'మన్మదుడు 2' యొక్క పరాజయంతో అక్కినేని నాగార్జున కొంతకాలం రొమాంటిక్ యాంగిల్ ని తాకడానికి ఇష్టపడట్లేదు. అందుకే ప్రస్తుతం, రచయిత మరియు దర్శకుడు సోలమన్ దర్శకత్వంలో "వైల్డ్ డాగ్" అనే ఉగ్ర దాడుల నేపథ్యంలో సాగే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఒక ఆసక్తికరమైన సమాచారం ఏమిటంటే, ఈ చిత్రం వాస్తవానికి 2008 లో హైదరాబాద్ నగరాన్ని కదిలించిన, గోకుల్ చాట్ మరియు లుంబిని పార్క్ యొక్క జంట పేలుళ్ల గురించి తెరకెక్కించబడుతుందట. ఎన్ఐఏ కోసం పనిచేసే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రను నాగార్జున పోషిస్తున్నాడు. అప్పటి భారత్ మొత్తాన్ని కదిలించిన జంట పేలుళ్ల కేసును పరిష్కరించడానికి నియమించిన ప్రధాన అధికారిగా ఆయన కనిపిస్తారు. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా నాగార్జున భార్య పాత్రలో నటిస్తుండగా, రే మూవీ ఫేమ్ నటి సయామి ఖేర్ హీరోతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ముంబైలో షూట్ ముగించుకొని, ఇటీవల యూనిట్ హైదరాబాద్లో గోకుల్ చాట్ మరియు ఇతర ప్రదేశాల సెట్లను ఏర్పాటు చేస్తోంది.