
అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 మొదలై నెల రోజులు పూర్తయ్యింది. ఇప్పటికే ఇంట్లో నుండి నలుగురు సభ్యులు ఎలిమినెట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రతిరోజు ఇంట్లో ఎం జరుగుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకులు వీకెండ్ కోసం కూడా అంతే ఎదురుచూస్తున్నారు. శని, ఆదివారాల్లో నాగార్జున వచ్చి సందడి చేయటం, ఇంటి సభ్యులు ఏమైనా తేడా చేస్తే కొన్ని చివాట్లు పెట్టడం చేయటంతో నాగ్ ఎప్పుడొస్తారా అని ప్రేక్షకులీజ్ ఎదురుచూస్తున్నారు. ముందు సీజన్ యాంకరింగ్ అనుభవాన్ని పరిగణించి ఈ సీజన్ లో కొంతవరకు తనను తాను మార్చుకొని బుల్లితెర అభిమానులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యారు. అయితే ఇటువంటి సమయంలో నాగ్ బిగ్ బాస్ నుంచి వెళ్తున్నారనే వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. అయితే కంగారు పాడాల్సింది ఏమి లేదు, నాగ్ కేవలం రెండు వారాలు మాత్రమే కనిపించరని తెలుస్తోంది. షూటింగ్ నిమ్మితం థాయ్ ల్యాండ్ వెళ్లి 10రోజులు షూటింగ్ లో పాల్గొని వస్తారని సమాచారం. ఇదేమి నాగ్ కి కొత్త కూడా కాదు, గత సీజన్ లో కూడా 60వ పుట్టినరోజు జరుపుకునేందుకు స్పెయిన్ వెళ్లిన నాగ్ రెండు వారాలు బిగ్ బాస్ లో కనిపించలేదు. అప్పుడు నాగ్ స్థానంలో రమ్యకృష్ణ అలరించింది. మరి ఈసారి నాగ్ లివ్ తీసుకుంటే ఆ ప్లేస్ లో ఎవరొస్తారన్నది ఆసక్తిగా మారింది.