
అక్కినేని నాగార్జున వయసు మీద పడుతున్న తన కొడుకులతో సమానంగా సినిమాలు చేస్తూ గట్టి పోటీ ఇస్తున్నాడు. నాగ్ నటించిన తాజా చిత్రం "మన్మధుడు2" బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది. నాగ్ వయసుకు ఆ రొమాన్స్ ఏంటంటూ విమర్శలు వినిపించాయి. దీంతో అలాంటి పాత్రలకు కాస్త గ్యాప్ ఇచ్చి సందేశాత్మక చిత్రంలో నటించాలని డిసైడ్ అయ్యాడు. ఈ మేరకు నూతన దర్శకుడు అహితోష్ సోలోమన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "వైల్డ్ డాగ్" లో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ బయటకు రాకుండా జాగ్రత్త పడి...నేడు హఠాత్తుగా చిత్ర ఫస్ట్ లుక్ తో పాటు సినిమాలో నాగ్ రోల్ ఏంటో కూడా విడుదల చేసింది. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అయిన ఎన్ ఐ ఏ అధికారిగా నాగార్జున నటిస్తున్నారు. సరికొత్త పద్దతిలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని నాగార్జున ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.