
కరోనా లాక్డౌన్ తర్వాత అక్కినేని నాగార్జున ఉన్నంత బిజీగా ఎవరు లేరు అన్నది మొమ్మాటికి నిజం. కరోనా ఇంకా విజృభిస్తున్న తరుణంలో షూటింగ్ చెయ్యాలా వద్దా అని కుర్ర హీరోలు ఆలోచిస్తున్న తరుణంలో చేతి నిండా షూటింగ్స్ తో అటు ఇటు తిరుగుతూ పిచ్చి బిజీగా ఉంటూ మనమే దీనికి అలవాటు పడాలని కుర్ర హీరోలకు చెప్పకనే చెప్పారు. అయితే లాక్డౌన్ సమయంలో థియేటర్స్ మూతబడడంతో అప్పుడు రిలీజ్ కు సిద్దమైన సినిమాలను ఓటిటిలు కొనుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఓటిటిలో తమ సినిమాలను విడుదల చేసేందుకు అగ్ర హీరోలు మాత్రం మొగ్గు చూపడం లేదు . అయితే తాజాగా అగ్ర ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ నాగార్జున హీరోగా నటిస్తున్న 'వైల్డ్ డాగ్' ను కొనుక్కునేందుకు భారీగా అఫర్ చేసినట్లు తెలుస్తుంది. కానీ డైరెక్టర్ సల్మాన్ మరియు నిర్మాతలు ఎం నిర్ణయం తినుకుంటారో చూడాలి.
Tags: #Cinecolorz #Nagarjuna #OTT