
ఆరుపదుల వయసులో కూడా అక్కినేని నాగార్జున దూకుడు చూస్తుంటే అతనికి ఇప్పుడున్న కుర్ర హీరోలు కూడా సరిపోరేమో అనిపిస్తుంది. కరోనా ముప్పుకి బయపడి చాలామంది హీరోలు ఇంకా షూటింగ్‌లకు వెళ్లకుండా ఇంట్లో ఉంటుంటే నాగార్జున మాత్రం చేతి నిండా ప్రాజెక్ట్‌లతో దేశదేశాలు తిరుగుతూ షూటింగ్‌లు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. వారంలో రోజుల్లో కనీసం నాగ్ ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకుంటున్నట్టు లేరు. ఒక పక్క బిగ్ బాస్ రియాల్టీ షోకి హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తుండగా, మరోపక్క తన వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ నిమిత్తం మనాలి వెళ్లి వచ్చారు. ఇవే కాకుండా బాలీవుడ్ చిత్రం 'బ్రహ్మాస్త్ర' లో నాగ్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో నాగ్ పాల్గొనేందుకు వెళ్లినట్లు సమాచారం. మొత్తానికి అక్కినేని హీరో జోష్ చూస్తుంటే ఈయనకి 60 ఏళ్ళు అంటే ఎవరు నమ్మరు.