
టాలీవుడ్ లో కొన్ని అద్భుతమైన చిత్రాలను నిర్మించిన అశ్విని దత్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ ధరఃసకత్వంలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాను నిర్మించనున్నారు. మహానటి ఫెమ్ నాగ్ అశ్విన్ ప్రభాస్ #21 చిత్రంపై అంచనాలను పెంచుతూనే ఉన్నారు. తాజాగా చిత్ర యూనిట్ అన్నట్లుగా ప్రభాస్ #21కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. ఈ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకునె అంటూ ప్రకటించడంతో అందరికి ఒక్కసారి దిమ్మతిరిగింది. అయితే, దీపికా పదుకునెనే ఎందుకు తీసుకున్నారో అనేదానిపై డైరెక్టర్ నాగి ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. 'రాజుకు తగ్గ రాణి కావాలి కదా....అందుకే చాలా అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాము'అని ట్వీట్ చేసారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది.