
తన సహజ నటనకు ప్రత్యేకమైన గుర్తింపు పొందిన నాచురల్ స్టార్ నాని మారుతి దాసరితో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. నాని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన నటుల్లో ఒకరు. అతను చాలా నెమ్మదిగా చిత్ర పరిశ్రమ లోకి వచ్చిన అంచెలంచెలుగా ఎదిగాడు. నాని 2008 లో తన సినీ జీవితాన్ని ప్రారంభించి ఇప్పటి వరకు ఎన్నో హిట్ చిత్రాలను అందించాడు. తాజా అప్డేట్ ప్రకారం, నాని తన ‘భలే భలే మగాడివోయ్’ దర్శకుడు మారుతి దాసరితో కలిసి కొత్త మరో చిత్రం కోసం జతకట్టబోతున్నాడు. ఇటీవల నాని మారుతి దాసరిని కలిసినప్పుడు, నానికి స్క్రిప్ట్ వివరించారని, ఆ స్క్రిప్ట్ నానిని బాగా ఆకట్టుకుంది. అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. మారుతి దాసరి, నాని చిత్రంను నిర్మించటానికి పలు పాత క్లాసిక్లను బ్యాంక్రోల్ చేసిన సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు ముందుకొచ్చారు. ప్లానింగ్ ప్రకారం ప్రతిదీ జరిగితే, నాని తన ప్రస్తుత సినిమాలను పూర్తి చేసిన తర్వాత వచ్చే ఏడాది మొదటి భాగంలో నాని మారుతి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.