
కరోనా కష్టకాలంలో సినీ తారలు, నిర్మాతలు, దర్శకులు ప్రభుత్వం లాక్ డౌన్ విధించినన్ని రోజులు ఇంటికే పరిమితమయ్యి ఇన్ని రోజులకు గాను రంగంలోకి దిగి షూటింగ్లకు సిద్ధమవుతున్నారు. అయితే థియేటర్లు ఇప్పట్లో తెరిసే అవకాశం లేకపోవడంతో అందరూ డిజిటల్ దునియా వైపు మొగ్గు చూపుతున్నారు. సినిమా షూటింగ్లు మెల్లిగా చేసుకుంటూ పోతూనే మరోవైపు డిజిటల్ లో వెబ్ సిరీస్ తిస్తూనో, నటిస్తూనో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే సమంత, కాజల్, తమన్నా తమ ఎంట్రీలు ఇవ్వగా....నిర్మాత దిల్ రాజు వెబ్ సిరీస్ ను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ జాబితాలోకి ఇప్పుడు మరో స్టార్ హీరో రాబోతున్నారు. నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన 'వి' అమెజాన్ ప్రైమ్ లో రాబోతున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో నాని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ' తను రాబోయే రోజుల్లో వెబ్ సిరీస్ను రూపొందించే యోచనలో ఉన్నానని తెలిపాడు.'