
నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన 'V' చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసింది. కానీ ఈ సినిమా ఊహించిన రీతిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో నాని తన తదుపరి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. 'టాక్ జగదీశ్' అనే సినిమా తెరకెక్కుతుండగా తాజాగా 'అంటే...సుందరానికి' అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను మోహన్ బాబు, రమ్యకృష్ణ జంటగా నటించిన 'అదిరింది అల్లుడు' చిత్రాన్ని ఆదర్శంగా తీసుకొని...ఇంచ్చు మించ్చు అలాంటి కథతోనే అంటే ..సుందరానికి సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏదో అబద్ధం చెప్పి హీరోయిన్ ఇంట్లోకి దూరి ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడి కుటుంబాన్ని ఒప్పించే కథ లాగా ఉండబోతుందని సమాచారం. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని నమ్మి ఈ సినిమా తీస్తున్న నానికి ఎదురు దెబ్బ తగిలితే కోలుకోవడం కష్టమే..ఎందుకంటే ఇప్పటికే వరసగా రెండు ఫ్లాప్‌లు ఖాతాలో చేరాయి.
Tags: #Cinecolorz #Nani #Nani28 #Tollywood