
సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు ప్రజలు సురక్షితంగా, బాధ్యతగా ఉండాలని తెలపడానికి ముందుకు వస్తున్నారు. భారతదేశంలో నెమ్మదిగా కరోనా వైరస్ పెరుగుతోంది. ఇది ప్రజలందరికీ ఆందోళన కలిగించే అంశం. కనీసం రెండు వారాల పాటు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ప్రముఖులు వైరస్ గురించి తీసుకోవలసిన ముందస్తూ జాగ్రత్త చర్యలు వివరించడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు నాచురల్ స్టార్ నాని తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రజలను బాధ్యతగా ఉండాలని కోరారు. రాజకీయాలు, కులం, డబ్బు పట్టింపులకు ఇప్పుడు తావు లేదని, వాటికి విలువ లేదని ఆయన అన్నారు. మనిషిగా మెలగడం అవసరమని అన్నారు. మనము ఒకరికోకరు తోడుగా నిలవాలని ఆయన అన్నారు. ప్రజలందరూ బాధ్యత వహించాలని, సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.