
నాచురల్ స్టార్ నాని సినిమాల విషయంలో ఇదివరకు చూపించినంత వేగం చూపించట్లేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలు తీసేవాడు కాస్త ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేసిన చాలు కానీ మంచి హిట్ అయితే చాలు అనుకుంటున్నాడు. అందుకే కథల ఎంపిక విషయంలో తొందరపాటుతనం చూపించట్లేదు. అయితే విజయ్ దేవరకొండతో టాక్సివాల తీసి ఇండస్ట్రీకి హిట్ తో పరిచయమైన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చాలా గ్యాప్ తీసుకొని ఒక భిన్నమైన కధను సిద్ధం చేసి నానికి వినిపించాడట. కధ విన్న నాని కాన్సెప్ట్ నచ్చినప్పటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. స్క్రీన్ ప్లే లో కొన్ని మార్పులు చేసి మరోసారి కథను వినిపించమని చెప్పాడట. ఇకపోతే నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న "V" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటిసారి ఫుల్ లెంగ్త్ నెగిటివ్ షెడ్ లో కనిపించనున్నాడు నాని.