
నాచురల్ స్టార్ నాని, ఎటువంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ను దక్కించుకున్నాడు. అయితే నాని ఒకే రకమైన సినిమాలు చేస్తున్నాడన్న టాక్ రావడంతో "జెర్సీ" సినిమాతో భిన్నమైన పాత్రలో కనిపించి ఫ్యాన్స్ అంచనాలను అందుకున్నాడు. జెర్సీ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో దీన్ని బాలీవుడ్లో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత నాని నటించిన గ్యాంగ్ లీడర్ మాత్రం ఊహించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం "V" అనే సినిమాలో మొదటిసారి ఫుల్ లెంగ్త్ విలన్ రోల్ లో కనిపించనున్నాడు నాని. ఇది ఇంకా రిలీజ్ కాకముందే తనకు "నిన్ను కోరి" లాంటి హిట్ చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు శివ నిర్వాణతో మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. అదే 'టక్-జగదీష్'. ఈ విషయాన్ని నాని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.ఇక ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానుంది.