
నాచురల్ స్టార్ నాని ఖాతాలో ఇప్పటికే పలు ప్రాజెక్టులు ఉన్నాయి. విశ్వక్ సేన్ మరియు రుహానీ శర్మ నటించిన నాని రెండవ ప్రొడక్షన్ వెంచర్ 'హిట్' ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. విమర్శకులు, సినీ ప్రేమికుల నుండి సినిమాకు మంచి స్పందన వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, నాని మరో చిత్రానికి సైన్ చేసాడు. దీన్నీ బ్రోచెవరేవరుఎవరురా ఫేమ్ వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేయనున్నారు. ఇటీవలే వివేక్ ఆత్రేయ నానిని కలుసుకుని స్క్రిప్ట్‌ను వివరించారు. కథనం నచ్చడంతో నాని వెంటనే తన ఆమోదం ఇచ్చాడు. ప్రస్తుతం, వివేక్ ఆత్రేయ పూర్తి స్క్రిప్ట్ డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. నాని మరియు వివేక్ ఆత్రేయ యొక్క రాబోయే ప్రాజెక్ట్ ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. తెరకెక్కబోయే ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. నాని తన ప్రస్తుత కమిట్మెంట్స్ ను పూర్తి చేసి వచ్చే సంవత్సరం సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. నాని ఇప్పటికే మోహన్ కృష్ణ ఇంద్రగంటి యొక్క దర్శకత్వ వెంచర్ 'V' యొక్క షూట్‌ను పూర్తి చేసిన నాని, 'టక్ జగదీష్' షూట్ ను కూడా ప్రారంభించాడు.