
నాని, సుధీర్ బాబు, అదితి రావు హైడారి మరియు నివేతా థామస్ ప్రధాన పాత్రలలో, 'V' మంచి ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. లాక్ డౌన్ తర్వాత మొదట రిలీజ్ అయిన పెద్ద తెలుగు సినిమా ఇది. అందుకే అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్నారు. ఇది నాని యొక్క 25వ చిత్రం మరియు ఈ థ్రిల్లర్‌లో సుధీర్ బాబు గంభీరమైన పోలీసుగా, నాని నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. అమిత్ త్రివేది సంగీతం అందించిన ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. మరి అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఎలా ఉందో ఏంటో తెలుసుకుందామా?
కధ: హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం డేరింగ్ అండ్ డాషింగ్ పోలీసు అధికారి డిసిపి ఆదిత్య( అనగా సుధీర్ బాబు) మరియు సీరియల్ కిల్లర్ (అనగా నాని) ల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. పదే పదే, సీరియల్ కిల్లర్ DCP ని ఆటపట్టిస్తాడు, అతని తదుపరి హత్య గురించి ఆధారాలు వదులుతూ, దమ్ముంటే అపమని ఛాలెంజ్ విసురుతూ ఉంటాడు. మరి ఈ పిల్లి ఎలుక గేమ్ లో ఎవరు గెలుస్తారనేది ఇంటికే వచ్చిన వెండితెరపై చూడాలి.
విశ్లేషణ: మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఎంచుకున్న కధ కొత్తదే అయినప్పటికీ, ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉండాలి. అప్పుడు సినిమాను చివరి దాక ఎంజాయ్ చేస్తారు. మోహన్ కృష్ణ ఈ విషయంలో కాస్త విఫలం అయ్యారనే చెప్పాలి. కానీ సినిమాలో ట్విస్ట్‌లు కొంత ఆసక్తిని రేపుతాయి. ఒక కథలో నాలుగు అయిదు ఫ్లాష్ బ్యాక్‌లు పెట్టడంతో అనవసరమైన ల్యాగ్ వచ్చిందనే భావన కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ బాగుందని అనిపించినా ఆ గ్రాఫ్ మెల్లిగా పడిపోతు వస్తుంది. డిసిపి సీరియల్ కిల్లర్ ను తన ఇన్వెస్టిగేషన్ ద్వారా క్షేదించుంటే బాగుండేది. SVc బ్యానర్ నిర్మాణ విలువలు బాగున్నాయి. అమిత్ త్రివేది పాటలు సినిమాక