
టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే నిలదొక్కుకోవడం కష్టం అలాంటిది ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి వరుసగా 7 హిట్లు కొట్టి తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకొని అప్కమింగ్ స్టార్స్ కు ఆదర్శంగా మారారు నాచురల్ స్టార్ నాని. అయితే రీసెంట్ గా విడుదలైన నాని రెండు సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. మామూలుగానే హిట్లు పడకపోతే మార్కెట్ పడిపోతుంది రెమ్యునరేషన్ తగ్గిపోతుంది. మరి ముఖ్యంగా లాక్ డౌన్ కారణంగా హీరోల రెమ్యునరేషన్ ను తగ్గించి మిగితా ఖర్చులను భర్తీ చేస్తున్నారు నిర్మాతలు. కానీ నాని ఇందుకు బిన్నం అని తెలుస్తుంది. వెంకట్ బోయినపల్లి నిర్మాతగా తెరకెక్కుతున్న 'శ్యామ్ సింగరాయ్' సినిమాకు గాను నాని రూ.9 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాకట్రట. ఈ లెక్కన లాక్ డౌన్ ఎఫెక్ట్ కానీ తన ఫ్లాప్ల ఎఫెక్ట్ కానీ నానిపై పడినట్లు కనిపియ్యట్లేదు.
Tags: #Cinecolorz #Nani #Shyamsingarai