
నాచురల్ స్టార్ నాని 2019లో జెర్సీ మరియు గ్యాంగ్ లీడర్, రెండు సినిమాలతో వచ్చినా అవి బాగున్నాయి అనిపించుకున్నాయే కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. రెండు సినిమాల్లో జెర్సీ కనీసం దగ్గర్లోకి వచ్చి ఆగిపోయింది. గ్యాంగ్ లీడర్ మాత్రం గోరంగా విఫలమైంది. అందుకనే నాని 2020 ను టార్గెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్న 'V' లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. మరోవైపు నానిశివ నిర్వాణ దర్శకత్వంలో "టక్ జగదీష్" అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం నాని మరొక సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. టాక్సివాలా లాంటి హిట్ చిత్రాన్ని ఇచ్చిన రాహుల్ సంకీర్తాన్ దర్శకత్వంలో నాని సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. నాని - రాహుల్ సంకీర్తాన్ చిత్రం నాని కెరియర్ లొనే భారీ బడ్జెట్ చిత్రం కానుందట.