
నారా కుటుంబం నుంచి వచ్చిన హీరో నారా రోహిత్ విడుదల చేసిన ఒక వీడియో ఇప్పుడు రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. సోషల్ మీడియాలో నారా రోహిత్ రిలీజ్ చేసిన ఆ వీడియో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో అయన ఏమన్నారంటే....'హాయ్... నేను నారా రోహిత్. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు తెలంగాణ తెలుగుదేశం ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం ఓ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం. మన తెలంగాణ తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ తగిన కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ క్యాంప్ ను విజయవంతం చేయమని కోరుతున్నానని' అని అన్నారు. ఈ వీడియో రిలీజ్ చేయటం ఆలస్యం, కొంతమంది నెటిజన్లు అయన త్వరలో తెలంగాణ టీడీపీ పగ్గాలను చేప్పట్టబోతున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం టి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్ రమణతో అసంతృప్తితో ఉన్న కార్యకర్తలు అధ్యక్షుడిని మార్చమని చంద్రబాబును కోరారు. దీంతో అదే సమయంలో నారా రోహిత్ ఈ వీడియో విడుదల చేయటంతో ఆయననే కాబోయే టి టీడీపీ అధ్యక్షుడు అంటూ ప్రచారం సాగుతుంది.