
ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత మలయాళ సూపర్ హిట్ చిత్రం 'లూసిఫర్' రీమేక్ లో నటించనున్నారు. తమిళ దర్శకుడు మోహన్ రాజా దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఈ చిత్రం మలయాళ మాతృకకు తెలుగులో పలు మార్పులు చేర్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగులో చిరంజీవి సరసన హీరోయిన్ పాత్ర ఉండాలన్న ఉద్దేశంతో మలయాళంలో లేని ఆ క్యారెక్టర్ ను ఇక్కడ జత చేస్తున్నారట. పైగా, ఆ పాత్రను కూడా కాస్త పవర్ ఫుల్ గానే రూపుదిద్దుతున్నట్టు తెలుస్తోంది. ఈ హీరోయిన్ పాత్రకు ప్రముఖ కథానాయిక నయనతారను తీసుకుంటున్నట్టు తాజా సమాచారం. చిరంజీవి స్టేచర్ కి నయనతార అయితే, బాగుంటుందన్న ఉద్దేశంతో ఆమెను ఎంచుకున్నట్టు చెబుతున్నారు.