
సౌత్ ఇండస్ట్రీలోని మహామహులతో నటించిన నయనతార పెళ్లి ఎప్పుడు హాట్ టాపికే. తమిళ డైరెక్టర్ విగ్నేష్ తో ప్రేమలో పడింది నయన్. సోషల్ మీడియాలో విగ్నేష్ తన ప్రేయసిపై తనకున్న ప్రేమను చూపెడుతూ ఎన్నో ఫోటోలు పెడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఈ జంట పెళ్లి గురించి ఇప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. మొన్నీమధ్యే ఈ ఇద్దరు ఎవరికి చెప్పకుండా గుడిలో పెళ్లి చేసేసుకున్నారని వార్తలొచ్చాయి. మరోసారి ఏదో పాత పురాతనమైన గుడిలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా పుకార్లు మొదలయ్యాయి. ఇదే విషయాన్ని విగ్నేష్ శివన్ ను అడిగితే....'మాకు ఇప్పుడే పెళ్లి ఆలోచన లేదు. నేను దర్శకత్వంలో బిజీ, నయన్ నటనలో బిజీ, పెళ్లికి సమయం లేదు. అయినా మాకు డేటింగ్ బోర్ కొడితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తామని' సమాధానం ఇచ్చాడు. దీంతో పుకార్ల నోర్లు మూతపడ్డాయి.