
లేడీ సూపర్ స్టార్ నయనతార ఆమె ప్రియుడు మరియు దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో మునిగితేలుతున్న విషయం తెలిసిందే. ఈ జంట ఎప్పటికి హాట్ టాపికే, కారణం సహజీవనం చేస్తున్నారు కానీ పెళ్లి ఊసే లేదు. అయితే తాజాగా మరోసారి కెమెరాలకు చిక్కి ఈ జంట వార్తల్లో నిలిచారు. కేరళలో పెద్ద పండుగ అయిన ఓనమ్ ను కుటుంబంతో జరుపుకునేందుకు ఈ ఇద్దరు చార్టెడ్ ఫ్లైట్ లో కేరళకు వెళ్లారు. దినికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అంతే ఆ ఫోటోలు చూసినవారంత ఇక వాళ్ళు అక్కడే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప్రచారం మొదలుపేట్టారు. కానీ, ఎప్పటిలాగానే ఈ ప్రేమ పక్షులు మాత్రం నోరు మెదపలేదు.