
లేడీ సూపర్ స్టార్ నయనతార, ఫిల్మ్ మేకర్ విఘ్నేష్ శివన్ ల పెళ్లి గురించి చాలా పుకార్లు పుట్టుకొస్తున్నే ఉన్నాయి. రహస్యంగా ఏదో దేవాలయంలో పూజలు జరిపించి పెళ్లి కూడా చేసుకున్నారని బలంగా వినిపించింది. కరోనా వైరస్ వ్యాపించడంతో దేశంతో లాక్డౌన్ కు వెళ్లిన సమయంలో ఈ ఇద్దరు సోషల్ మీడియాలో తమ ఫోటోలు పెట్టి కొన్ని రోజుల పాటు హాట్ టాపిక్ గా మారారు. ఇప్పుడు సినిమాలకు బ్రేక్ పడటంతో ఇక ఇద్దరు తీరికగా ఉండటంతో పెళ్లి తప్పకుండ చేసుకుంటారని అంతా భావించారు. కానీ అది జరగలేదు. నాలుగేళ్లకు పైగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ ఇద్దరు కలిసి జీవిస్తున్నారు కానీ ఇంకా మూడు ముళ్ళతో ఒక్కటవ్వలేదు. ఇప్పుడు, చిత్ర పరిశ్రమలో తాజా సమాచారం ప్రకారం, నయనతార తన పాత్రలలో దేనికైనా జాతీయ అవార్డును పొందిన తరువాత మాత్రమే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారట. మరి నయనతార కోరిక నిజమే అయితే అది త్వరగా నెరవేరాలని కోరుకుందాం.